- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొమ్మిదో తరగతి బాలికపై స్కూల్ మేట్ లైంగిక వేధింపులు.. తండ్రి అత్యాచారం..
దిశ, వెబ్‌డెస్క్: తండ్రి, కొడుకులిద్దరు తొమ్మిదో తరగతి చదువుతోన్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 13ఏళ్ల బాలిక స్కూల్ మెట్ అయిన 18 ఏళ్ల బాలుడు రాబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ తన దగ్గర ఉందని, దాని ఫొటో కాపీ ఇస్తానని ఆ బాలికను నమ్మించాడు. మార్చి 13న, బాలుడు 9వ తరగతి బాలికను పాఠశాల నుంచి తన ఇంటికి తీసుకువెళ్లి... అనంతరం ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో, బాలుడి తండ్రి (42)బాలుడి గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
కుమారుడిని కోప్పడి బయటికి పంపించేసి, తర్వాత ఆ చిన్నారికి కాపాడాల్సింది పోయి.. అరవకుండా ఆమె నోటిని స్కార్ఫ్ తో కట్టేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే బాలికను చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఇంటికి వెళ్లార జరిగిన విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. మార్చి 14న బాధితురాలి అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. మళ్లీ మార్చి 17న పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శర్మకు లేఖ రాసింది. పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో ఆమె ఆదివారం కోర్టును ఆశ్రయించింది. ‘‘ఆ దుర్మార్గుల బారినుంచి తప్పించుకుని నా మేనకోడలు ఎలా గోలా ఇంటికి చేరుకుందని’’ ఆమె తీవ్రంగా గాయపడింది. భయంతో ఏమి మాట్లాడలేకపోయిందంటూ’’ ఆమె చెప్పుకొచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌హెచ్‌ఓ త్యాగి నరేష్ ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 341 (ఒక వ్యక్తిని తప్పుగా నిరోధించడం), 376 (అత్యాచారం), 354 (ఆమె నమ్రతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో ఒక మహిళపై క్రిమినల్ ఫోర్స్ ప్రయోగించడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) లాంటి పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ ఘటన మార్చి 13వ తేదీన జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.