- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవోను హత్య చేశారు..బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతల భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్యను హత్య చేశారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇటీవల కిరాయి హంతకులు చేతిలో దారున హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కుటుంబాన్ని బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పక్షాన పోరాడుతున్న రామకృష్ణయ్యను బీఆర్ఎస్ నాయకులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో కుక్క పిల్లలకు కూడా రక్షణ కల్పించే పోలీసులకు, రామక్రిష్ణయ్య ప్రాణాలను కాపాడలేకపోవడం చూస్తే అంతా పక్కా ప్లానుతో జరిగిన కుట్రగా కనిపిస్తోందని అన్నారు.
ఈ హత్య వెనుక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హస్తం ఉందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారని, బీఆర్ఎస్ నేతల ఆగడాలను ప్రశ్నిస్తూ,పేదల పక్షాన పోరాడుతున్నందుకే ఈ హత్య జరిగిందని తాను భావిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అండతో సీరియల్ హత్యలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ జరిపి ఉరి శిక్ష పడేదాక వదలబోమని హెచ్చరించారు.
జనగామ జిల్లాలో కిరాయి హంతకుల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన రిటైర్డ్ MPDO నల్ల రామకృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించాను. ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న @BRSparty నేతలను అడ్డుకున్నందుకే పక్కా ప్రణాళికతో పట్టపగలు కిడ్నాప్ చేసి,దారుణంగా హత్య చేశారు. కేసీఆర్ కుటుంబంలో… pic.twitter.com/Y9UPU81oLV
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 21, 2023