ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌పై ACB కేసు

by Gantepaka Srikanth |
ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌పై ACB కేసు
X

దిశ, సిటీక్రైం: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకట భూపాల్ రెడ్డి(Venkata Bhupal Reddy) మరోసారి చిక్కుల్లో పడ్డారు. 2 నెలల ముందు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు దొరికి జైలు పాలైన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి అదనపు కలెక్టర్ అక్రమాస్తుల ఫిర్యాదుపై అతని ఇంటితో పాటు మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ప్రభుత్వ ధర ప్రకారం అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డికి రూ.5.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇందులో రూ.4.19 కోట్ల విలువ చేసే ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఓపెన్ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.30 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ ఏడాది అగస్టు 14న ముత్యంరెడ్డి రైతుకు సంబంధించిన 14 గుంటల స్థలాన్ని ప్రోహిబిటెడ్ నుంచి తొలిగించేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ద్వారా రూ.8 లక్షలు తీసుకుని ఏసీబీ అధికారులు అరెస్ట్ దొరికి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed