రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

by Shiva |
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
X

దిశ, తాడ్వాయి : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని దేవాయిపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవాయిపల్లి గేటు వద్ద లింగంపేట మండలం నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పల్సర్ బైక్ పై కామారెడ్డి వైపు వెళ్తున్నాడు. మరో వాహనంపై లింగంపేట మండలం మోతే గ్రామానికి చెందిన సత్తూరి శ్రీశైలం (40) బ్రహ్మాజీ వాడి నుంచి స్వగ్రామం వెళ్తుండగా అతని బైక్ ను ఎదురుగా బైక్ బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో కొట్టుమిట్టడుతున్న వారిని పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story