- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ స్టేషన్ ముందు అత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మృతి
దిశ, అందోల్: జోగిపేట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని అత్మహత్య యత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జోగిపేట పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఖలీల్ (40) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఉస్మానియా అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 14వ తేదీన తనపై జోగిపేటలో దాడి చేసారంటూ 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే జోగిపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం రావడంతో పోలీసులు దాడి జరిగిన చోటుకు వేళ్లి చూడగా, అక్కడ ఖలీల్ తప్ప ఇతరులేవరూ లేకపోవడంతో, అక్కడున్న వారిని గొడవ జరిగిన విషయంపై ప్రశ్నించగా, గొడవ జరిగిన మాట వాస్తవమే కానీ, వారెవ్వరు అనే విషయం తమకు తెలియదని అక్కడున్న వారు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఖలీల్‌ను జోగిపేట పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చి విచారణ చేసి నీపై దాడిచేసిన వారిని ఉదయాన్నే పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తామని సర్ధిచేప్పారు. అయితే ఖలీల్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వొంటిపై పోసుకుని నిప్పంటించుకుని స్టేషన్‌లోకి పరుగు తీసాడు. అప్రమత్తమైన పోలీసులు స్టేషన్‌లోనే ఉన్న సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌లు బయటకు వచ్చి సిబ్బందితో ఒంటిపై ఉన్న మంటలను ఆర్పివేయించారు. వెంటనే జోగిపేట అసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు పంపించారు. ఈ ఘటనపై డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి జోగిపేటకు వచ్చి ఆరా తీశారు. బుధవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు