త్వరలోనే మొదటి సినిమా రిలీజ్.. యాక్సిడెంట్ లో కాలును కోల్పోయిన హీరో

by Javid Pasha |
త్వరలోనే మొదటి సినిమా రిలీజ్.. యాక్సిడెంట్ లో కాలును కోల్పోయిన హీరో
X

దిశ, వెబ్ డెస్క్: తాను హీరోగా నటించిన సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇంతలోనే విధి వెక్కిరించింది. శనివారం జరిగిన యాక్సిడెంట్ లో కన్నడ నటుడు సూరజ్ కుమార్ తన కాలును కోల్పోయాడు. దీంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ కన్నడ ప్రొడ్యూసర్ఎస్ఏ శ్రీనివాస్ కుమారుడు సూరజ్ కుమార్ ‘రతన్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా మలయాళం బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోంది. దాదాపు షూటింగ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోగా నటిస్తున్న సూరజ్ కుమార్ బైక్ పై మైసూరు నుంచి ఊటీకి వెళ్తున్నాడు.

ఈ క్రమంలోనే మైసూరు శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ తప్పించబోయి టిప్పర్ కిందకు బైక్ తో సహా దూసుకుపోయాడు. ఈ ఘటనలో ఆయన కుడి కాలి మోకాలి కింది భాగం టైర్ కిందపడి నుజ్జునుజ్జు అయింది. దీంతో అతడిని వెంటనే మైసూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన కుడికాలి కింది భాగాన్ని తొలగించారు. ఇక విషయం బయడ తెలవడంతో కన్నడ సిని పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరజ్ ను కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ , ఆయన సతీమణి గీత తదితరులు పరామర్శించారు.

Advertisement

Next Story