పురుగుల మందు తాగి జూనియర్ లైన్ ‌మెన్ ఆత్మహత్య

by Seetharam |   ( Updated:2023-06-07 14:56:20.0  )
పురుగుల మందు తాగి జూనియర్ లైన్ ‌మెన్ ఆత్మహత్య
X

దిశ నేరేడుచర్ల (పాలకవీడు): కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి జూనియర్ లైన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సుర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని యల్లపురం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని యల్లపురం గ్రామానికి చెందిన పోలగాని వెంకటేశ్వర్లు (40)ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ లో నేరేడుచర్ల పట్టణంలో జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా నేరేడుచర్ల పట్టణంలోనే కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటివల కాలంలో భర్యభర్తల మధ్య కుటుంబ కలహలు, విబేధాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్ళి పోయింది . దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. తన సొంత ఊరు అయిన యల్లపురం గ్రామంలోని తన వ్యవసాయ పోలంలో పురుగుల మందు త్రాగి మంగళవారం రాత్రి ఆత్మహత్య కు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు . బుధవారం ఉదయం అక్కడకు కల్లు తీసేందుకు వెళ్ళిన గీత కార్మికుడు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

Next Story

Most Viewed