మీడియా రిపోర్టర్‌ల మంటూ.. రూ.10 వేలు డిమాండ్.. చాకచక్యంగా వ్యవహరించిన హాస్పిటల్ మేనేజ్మెంట్

by Aamani |
మీడియా రిపోర్టర్‌ల మంటూ.. రూ.10 వేలు డిమాండ్.. చాకచక్యంగా వ్యవహరించిన హాస్పిటల్ మేనేజ్మెంట్
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా పేరు ప్రైవేటు హాస్పిటల్ మేనేజ్మెంట్ ను రూ. 10 వేలు డిమాండ్ చేసి బెదిరించి కటకటాల పాలైన సంఘటన శనివారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం..14 సాయంత్రం 7:30 గంటలకు బెల్లంపల్లిలో కృష్ణ మందిర్ లైన్ లో గల నిత్యా పిల్లల హాస్పిటల్ కు నవాబ్ , శంషాద్ అహ్మద్ మరో వ్యక్తి కలిసి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లమని చెప్పి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ను డబ్బులు డిమాండ్ చేశారు.

డాక్టర్ డబ్బుల విషయం తమకు సంబంధం లేదు మా మేనేజ్మెంట్ వారికి కలవమని చెప్పారు. దీంతో సదరు ముగ్గురు రిపోర్టర్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ కొమురవెల్లి సంతోష ను కలిసి రూ. 10 వేల కావాలని డిమాండ్ చేయగా తన దగ్గర డబ్బులు లేవన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో ముగ్గురు రిపోర్టర్లు కొమురవెల్లి సంతోష్ తో గొడవ కు దిగారు. ఈ విషయమై కొమురవెల్లి సంతోష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు దేవయ్య తెలిపారు.

Next Story

Most Viewed