పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బస్సు కాలువలో పడి ఐదుగురు మృతి

by Mahesh |   ( Updated:2023-05-08 04:45:33.0  )
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బస్సు కాలువలో పడి ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి బస్సు కాలువలో పడి ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి మధుఘర్‌ సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని ఓరై మెడికల్ కాలేజీకి తరలించారు.

జలౌన్ జిల్లా మడైల గ్రామం నుంచి పెళ్లి బృందం దూతవలి గ్రామానికి బస్సులో వెళ్లింది. అక్కడ వివాహాది కార్యక్రమాలు ముగించుకుని మడైల గ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యానాథ్ ఆకాంక్షించారు.

Advertisement

Next Story