- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిగ్రీ విద్యార్థినిని హోటల్లో బంధించి మూడు రోజులపాటు అత్యాచారం.. ఏకంగా ఎంత మంది అంటే..!
దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు ఏదో అన్నారని వారిపై కోపంతో బయటకు వచ్చేస్తున్నారు నేటి యువత. బయటకు వచ్చాక కాలేజ్ ఫీజులని, రూమ్ రెంట్‌లని డబ్బులు కోసం ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులపై అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చదువుకుంటుంది. కాలేజ్ ఫీజు కట్టేందుకు తోటి విద్యార్థిని సహాయం కోరగా.. అతని ద్వారా మరో ఇద్దరి పరిచయం అయ్యారు. అయితే.. డబ్బులు ఇస్తామని రమ్మని చెప్పిన ఆ వ్యక్తులు ఓ హోటల్ గదిలో విద్యార్థిని బంధించి మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వాళ్ల నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని నీలగిరికి చెందిన 20 ఏళ్ల యువతి కోయంబత్తూరులోని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఏవో కారణాల చేత తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న యువతి.. కాలేజ్ ఫీజు చెల్లించడానికి తోటి విద్యార్థిని సాయం కోరింది. అయితే అతడు ద్వారా కొండయంపాళెయానికి చెందిన జెర్మన్ రాజేష్, రవీంద్రన్ అనే వ్యక్తులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రంమలోనే ఏప్రిల్ 23న రాజేష్, రవీంద్రన్ ఆమెకు డబ్బులు ఇస్తాం రమ్మని ఓ హోటల్ గదికి తీసుకెళ్లారు. అక్కడ యువతిని మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా వివరించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు హోటల్ గదికి వెళ్లగా.. అప్పటికే వారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అయితే వాహనాలు తనిఖీలు చేయించగా నిందితులు పోలీసులకు చిక్కారు. వాళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.