- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం వ్యాన్..
దిశ, భిక్కనూరు : ఆర్టీసీ లగ్జరీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొన్న సంఘటన భిక్కనూరు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే నిర్మల్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు హైదరాబాదు నుంచి గురువారం అర్ధరాత్రి నిర్మల్ కు బయలుదేరింది. శుక్రవారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తావద్దకు చేరుకుంది. చౌరస్తావద్దకు చేరుకోగానే బస్సుముందు వెళ్తున్న మరో వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేసింది.
దాంతో బస్సు డ్రైవర్ కూడా ఎడమ వైపుకు తిప్పి బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో నియంత్రణ లేని వేగంతో, అదే దారిలో వస్తున్న డీసీఎం వ్యాన్ బస్సును వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం దెబ్బతిన్నప్పటికీ, బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యం వల్లే పెనుప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ఈ మేరకు డ్రైవర్ షేక్ ముహబ్బల్ పాషా ఫిర్యాదు మేరకు భిక్కనూరు ఎస్సై ఆనంద్ గౌడ్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.