- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Murders: తొందరపాటు నిర్ణయాలతో హత్యలు.. పోలీసులే షాక్ అయ్యేలా ట్విస్టులు
దేశంలో హింస రోజురోజుకూ పెరిగిపోతున్నది. క్షణికావేశంలో హత్యలు(Murders) చేస్తున్నవారు కొందరైతే.. ఎదుటివారి వ్యామోహంలో పడి సొంత వారినే కడతేరుస్తున్న వారు మరి కొందరు. ఆస్తులు, ఆభరణాల కోసం మర్డర్స్(Murders) చేస్తున్న వారు ఇంకొందరు. విషయం ఏదైనా ప్రాణాలు మాత్రం పోక తప్పడంలేదు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. ఎదుటి వారిని చంపి డెడ్‌బాడీని మాయం చేసి చట్టం నుంచి తప్పించుకునే కొందరు ప్రయత్నం చేస్తుంటే. మరికొందరు డెడ్‌బాడీని సైతం ముక్కలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. నేరం బయటపడటంతో కొందరు పశ్చాతాపం పడితే, మరికొందరు తాము చేసింది కరక్టేననే ఫీలవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్(Shraddha Walkar) ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ, అంతకు ముందు సైతం ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులే షాక్ అయ్యేలా హంతకులు ట్విస్టు ఇచ్చిన ఘటనలపై ప్రత్యేక కథనం. పీ. మహేశ్ కుమార్
డెహ్రాడూన్‌లో అనుపమ
ఉత్తరప్రదేశ్‌లోని డెహ్రాడూన్‌లో అక్టోబర్ 2010లో అనుపమ గులాటీ అనే మహిళను ఆమె భర్త రాజేశ్ కిరాతకంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 72 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత ఆ భాగాలను ఒక్కొక్కటిగా దగ్గరలో ఉన్న అటవీ (ముస్సోరీ) ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనుపమ ఫ్యామిలీకి సైతం ఎలాంటి అనుమానం రాకుండా ఆమె మెయిల్‌ను ఉపయోగించి వారికి తరచుగా మెసేజ్‌లు పంపించాడు. చివరకు పోలీసులు కేసును చేధించడంతో అసలు విషయం బటయపడింది.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్..
ముంబైలోని ఓ కాల్ సెంటర్‌లో శ్రద్ధా వాకర్ అనే 27 ఏండ్ల యువతి, అఫ్తాన్ అమీన్ అనే వ్యక్తితో పనిచేసేది. వారి పరిచయం డేటింగ్ వరకు వెళ్లింది. వీరి రిలేషన్‌ను శ్రద్ధా ఫ్యామిలీ అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఢిల్లీకి పారిపోయారు. యువతి తల్లిదండ్రులు ఆమె బాగోగులను శ్రద్ధా సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకునేవారు. కొంత కాలం తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో అనుమానం వచ్చి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎంక్వయిరీ మొదలుపెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2022 మేలో ఆమె హత్యకు గురైనట్టు తేలింది.
ఫిర్యాదు చేసినట్టుగానే..
హత్యకు గురయ్యే రెండేండ్ల క్రితమే అఫ్తాన్‌పై పోలీసులకు శ్రద్ధా వాకర్ ఫిర్యాదు చేసింది. అతడు తనను గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడని అందులో పేర్కొంది. తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ముక్కలుగా నరికేస్తానని భయపెడుతున్నాడని, ఆరు నెలలుగా కొడుతూ హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదులో శ్రద్ధా వాకర్ తెలిపినట్టుగానే అఫ్తాన్ ఆమెను హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. మూడు వారాల పాటు అలాగే ఉంచాడు. తర్వాత ఆ భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.
చెన్నైలో దీప
గత నెలలో (సెప్టెంబర్) చెన్నైలోని కుమరన్ కుడిల్ మెయిన్ రోడ్డు వద్ద సూట్ కేసులో దీప అనే 32 ఏండ్ల మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఆమెను హత్య చేసింది 22 ఏండ్ల యువకుడు (మణికందన్) కావడం గమనార్హం. మాధవరం సమీపంలోని పొన్నియమ్మన్ మేడలో దీప నివాసం ఉండేది. రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో దీప సోదరుడికి అనుమానం వచ్చింది. మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసుల సహాయంతో ఆమె ఫోన్ ఉన్న లొకేషన్‌ను గుర్తించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. చుట్టపక్కల పరిశీలించగా ఓ సూట్ కేసు లభించింది. అందులో దీప మృతదేహం కనబడటంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె ఫోన్ కాల్ డాటా చెక్ చేయగా.. మణికందన్‌తో చివరిసారిగా మాట్లాడినట్టు తేలింది. దీపతో స్నేహం పెంచుకున్న మణికందన్ ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో హత్య చేసినట్టు సమాచారం.
బెంగళూరులో మహాలక్ష్మి
బెంగళూరులోని వయ్యాలికావల్ ఏరియాలోని గతనెల (2024, సెప్టెంబర్) ఒక అపార్ట్‌మెంటులో మహాలక్ష్మి అనే 29 ఏండ్ల యువతిని 59 ముక్కులుగా నరికి ఫ్రిజ్‌లో దాచారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పక్కనున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ ఇంటిని తనిఖీ చేయగా ఫ్రిజ్‌లో యువతి శరీరభాగాలు కనిపించాయి. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు కనుగొన్నారు. పలు కారణాల వల్ల మహాలక్ష్మి భర్తతో విడిపోయి బెంగళూరులో నివాసముంటోంది. అక్కడే మల్లేశ్వరంలోని ఓ బట్టల షాపింగ్ మాల్‌లో పని చేస్తూ ఉండేది. ఈ క్రమంలో అందులోనే పనిచేస్తున్న ముక్తిరంజన్ అనే వ్యక్తితో 2023లో ఆమెకు పరిచయం ఏర్పిడింది. అనంతరం అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండటంతో ముక్తి రంజన్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం మహాలక్ష్మిని అతడు హత్య చేసి ముక్కులుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు కొద్దిరోజులకే ఒడిశాలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి ముందు కన్నీటిపర్యంతం
‘మా అబ్బాయి ముక్తి రంజన్ మూడేండ్లుగా ఇంటికి రాలేదు. అకస్మాత్తుగా గతనెల (సెప్టెంబర్) 24న రాత్రి ఇంటికి వచ్చాడు. బెంగళూరులో సెప్టెంబరు 3న మర్డర్ చేశానని చెప్పాడు. మహాలక్ష్మిని తాను ప్రేమిస్తే, ఆమె మోసం చేసిందని ఏడ్చాడు. తన నుంచి డబ్బు, బంగారం లాక్కుందన్నాడు. కిడ్నాప్ కేసు పెడతానని కొంతమందితో కలిసి బెదిరించిందన్నాడు. తాను బెంగళూరులోని మహాలక్ష్మి ఇంటికి వెళ్లగా.. ఆమె గొడవకు దిగిందని నా కొడుకు చెప్పాడు. కోపంలో మహాలక్ష్మిని గొంతుకోసి చంపానన్నాడు. నా కొడుకు చెప్పిన మాటలు విని షాకయ్యాను. అంటూ ముక్తి రంజన్ రాయ్ తల్లి మీడియాకు వివరించింది. తన వల్ల కుటుంబానికి ఇబ్బంది కలగకూడదని చెప్పిన ముక్తిరంజన్ 25వ తేదీన తెల్లవారుజామునే ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. అనంతరం సూసైడ్ చేసుకున్నాడనే వార్త తమకు అందిందని అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది.
విశాఖలో ధనలక్ష్మి
విశాఖపట్నంలోని మధురవాడలో సుమారు ఏడాదిగాపైగా మృతదేహం డ్రమ్ములోనే ఉన్న విషయం వెలుగులోకి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన డిసెంబర్ 2022లో వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రుషివర్ధన్ (29) విశాఖపట్నంలోని మధురవాడలో ఓ వెల్డింగ్ షాపులో సెప్టెంబర్ 2020లో హెల్పర్‌గా చేరాడు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అతని భార్య గర్భవతి కావడంతో ఆమెను 2021 మే 29న శ్రీకాకుళంలో హాస్పిటల్‌లో చూపించి విశాఖ బయలుదేరారు. బస్సు కోసం వెయిట్ చేస్తుండగా అతనికి ధనలక్ష్మి అనే మహిళా పరిచయమైంది. ఇద్దరూ షేర్ ఆటో ఎక్కారు. అదే క్రమంలో ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. రెండు రోజుల తర్వాత ఆమె రుషివర్ధన్‌కు ఉండే ప్రాంతానికి వచ్చింది.
ఆమెను తాను అద్దెకుంటున్న ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే అరచి అందరినీ పిలుస్తానని అతన్ని ధనలక్ష్మి బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ క్రమంలో భయపడిన రిషివర్ధన్ ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి వాటర్ డ్రమ్ములో వేసి సీజ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అద్దె కోసం ఇంటి ఓనర్ ఫోన్ చేయడంతో అదిగో ఇదిగో అంటూ ఏడాది గడిపాడు. దీంతో విసుగుచెందిన ఓనర్.. ఆ ఇంటిని వేరే వారికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రిషివర్ధన్‌కు అద్దెకిచ్చిన ఇంటిని శుభ్రం చేసేందుకు 2022 డిసెంబర్ 6న ఓపెన్ చేశాడు. శుభ్రం చేస్తున్న టైం అతనికి ఓ డ్రమ్ము కనిపించింది. దానిని ఓపెన్ చేసే క్రమంలో దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు డ్రమ్మును తెరవగా అందులో మృతదేహం ముద్దగా మారింది. వెంట్రుకలు మాత్రం పొడవుగా ఉండటంతో మహిళ అని గుర్తించారు. చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.
పట్టిచ్చిన మటన్ సూప్
2017 డిసెంబర్‌లో నాగర్‌కర్నూల్‌లో ఓ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన సుధాకర్ రెడ్డి, స్వాతి భార్యాభర్తలు. స్వాతి నడుము నొప్పితో బాధపడుతుండటంతో (హత్యకు రెండేండ్ల ముందు) రాజేశ్ అనే ఓ ఫిజియోథెరపిస్ట్ వద్దకు ట్రీట్‌మెంట్ కోసం వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి వరకు వెళ్లింది. 2017 నవంబర్‌లో రాజేశ్‌తో కలిసి స్వాతి బైక్ మీద మహబూబ్‌నగర్ వెళ్లింది. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుధాకర్‌రెడ్డి భార్యను నిలదీశాడు. దీంతో ఆమె అసలు విషయం చెప్పడంతో గొడవ జరిగింది. భర్తకు తన విషయం తెలిసిపోయిందని కంగారుపడిన ఆమె.. ఎలాగైనా సుధాకర్ రెడ్డిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. రాజేశ్, సుధాకర్‌రెడ్డి చూసేందుకు దాదాపుగా ఒకేలాగా ఉండటంతో పెద్ద స్కెచ్ వేసింది. దీంతో సుధాకర్‌ను హత్య చేసి రాజేశ్ ముఖంపై యాసిడ్ పోసింది.
తర్వాత తన భర్తపై ఎవరో యాసిడ్ దాడి చేశారని డ్రామా ఆడింది. భర్త స్థానంలో ప్రియుడికి తెచ్చి పెట్టింది. మొహం నిండా యాసిడ్ గాయాలు ఉండటంతో సుధాకర్ తల్లిదండ్రులు రాజేశ్‌నే తమ కొడుకని భావించారు. అంతా స్వాతి అనుకున్నట్టే జరుగుతున్నది. చికిత్స జరుగుతున్న సమయంలో సుధాకర్ కు ఇష్టమని ఆమె తల్లి మటన్ సూప్ చేసి తీసుకువచ్చింది. అయితే, రాజేశ్ వెజిటేరియన్ కావడంతో అది తాగేందుకు ఇష్టపడలేదు. దీంతో సుధాకర్ రెడ్డి తల్లికి కొంత అనుమానం వచ్చింది. అది బలపడటంతో చికిత్స పొందుతున్నది తన కొడుకు కాదని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. బిల్లు కట్టే సమయంలో సుధాకర్ రెడ్డి ఆధార్ కార్డు తీసుకున్నారు. వేలిముద్రలు తనిఖీ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రాజేశ్‌ను విచారణ చేయడంతో ప్లాన్ మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. మొత్తానికి నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
తల్లిని చంపి..
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సునీల్ మద్యానికి బానిసై 2017 ఆగస్టు 27న తన తల్లి ఎల్లమ్మను దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి వాటిని వండుకుని తినేందుకు ప్రయత్నించాడు. తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి 2021లో కొల్హాపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని వెల్లడించింది. దీనిని నరమాంస భక్షక కేసుగా కోర్టు అభివర్ణించింది.