- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి...చేతులు కట్టేసి...

దిశ,సత్తుపల్లి/వేంసూరు : వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి...చేతులు కట్టేసి...కత్తితో బెదిరించి దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆమె మెడలో ఉన్న బంగారపు గొలుసు అపహరించుకుపోయారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన రామిశెట్టి రాములమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా దుండగులు ఆమె ఒంటిపై ఉన్న సుమారు మూడు తులాల బంగారపు గొలుసును అపహరించారు.
వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి,చేతులు కట్టేసి మెడలోని గొలుసును అపహరించుకుపోయారు. కత్తి చూపించి చంపుతామని బెదిరించారని పేర్కొంది. కట్లను విడిపించుకొని కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చారని బాధితురాలు తెలిపారు. బంధువుల సహాయంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి ఇంటిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Tags
- theft