- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇటలీలో విషాదం..
రోమ్: ఇటలీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం శరణార్థులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 43 మంది మరణించారు. దాదాపు 80 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. తీరానికి చేరుకునే క్రమంలో కాలాబ్రియా తూర్పు తీరంలో ఉన్న సముద్రతీర రిసార్ట్ అయిన స్టెకాటో డి కట్రో సమీపంలో ఓడ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రాయిని ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో 120 మందికి పైగా ఉన్నట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా బ్రతికి ఉన్నారనే విషయమై గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని విచారం వ్యక్తం చేశారు. సముద్ర ప్రాంతంలో మరణాలను నివారించడానికి అక్రమ వలసలను ఆపాలని పిలుపునిచ్చారు. ఇటలీకి ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుంచి సముద్ర మార్గాల ద్వారా శరణార్థులు వలస వస్తారు.