ఫోక్సో యాక్ట్ కేసు నిందితుడికి 20 సంవత్సరాల జైలు

by Javid Pasha |
ఫోక్సో యాక్ట్ కేసు నిందితుడికి 20 సంవత్సరాల జైలు
X

దిశ, అనకాపల్లి: బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఫోక్సో యాక్ట్ కింద న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా విధించింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బన్నవోలు గ్రామంలో గత ఏడాది ఫోక్సో యాక్ట్ క్రింద నమోదైన కేసులో ఒక చిన్నారి పైన జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 12 రోజుల్లో చార్జ్ షీట్ వేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితుడికి విశాఖపట్నంలోని ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది. దీనిపై అనకాపల్లి జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.

చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ఇటువంటి కేసుల్లో తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, ఇటువంటి ఘోరం ఇక మీదట జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు నష్టపరిహారం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించిన డీఎస్పీ మల్ల మహేష్, కేసు వాదించిన పీపీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story