- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 నెలల పసికందు మృతికి కారణం అదే..
by Sumithra |
X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండల కేంద్రంలో సుభాష్ గల్లిలో ఓ నీటి కుండిలో పడి నడుకుడ యశ్వంత్ (18 నెలల) పసికందు ఆదివారం మృతి చెందాడు. రెండు, మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు నందిపేట్ లోని సుభాష్ గల్లీలో గల నీటి కుండీలు నిండుకున్నాయి.
కాగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్న మున్నూరుకాపు కులానికి చెందిన నడుకుడ శ్రీనివాస్ - నడుకుడ మమత దంపతుల (18 నెలల) పసికందు నడుకుడ యశ్వంత్ నీటి కుండీలో పడి మృతిచెందాడు. చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ వెలుతూ ఇంటి బయట పరిసరాల్లో గల నీటి కుండీలో పడిపోయాడు. 18 నెలల వయసున్న చిన్నారి అకాల వర్షానికి నిండిన నీటి కుండీలో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. ఆ దంపతులకు మూడేళ్ల వయసు గల పెద్ద కుమారుడు ఉన్నాడు.
Advertisement
Next Story