- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. స్టేషన్ బెయిల్ విషయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో చికెన్ సెంటర్ నడుపుతున్న వేముల సంపత్ అనే వ్యక్తికి ఈ నెల 8న మరో వ్యక్తికి గొడవ జరిగింది. ఈ కేసులో సంపత్‌కి స్టేషన్ బెయిల్ ఇస్తానని చెప్పి వారి వద్ద వేములవాడ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్ర ప్రకాష్ రూ.6000 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం గురువారం హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాశ్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ లంచం తీసుకున్న సంఘటనలో ఇంకా ఎవరైనా పోలీసు అధికారులకు సంబంధం ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాశ్‌ను ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ భద్రయ్య చెప్పారు.