- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒంటిపై కిరోసిన్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

X
దిశ, కోనరావుపేట: మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని శివంగలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన బొమ్మెన వెంకటేశం( 37 ) అనే యువకుడు శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపైన కిరోసిన్ పోసి నిప్పు అంటించుకున్నాడు. మంటకు తాళలేక అరవంతో చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసే సరికి వెంకటేశం శరీరం సగానికంటే ఎక్కువ కాలిపోయింది. అతడిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story