రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు జమ్మికుంటకు పని నిమిత్తం వచ్చి తిరిగి నర్సింగాపూర్ గ్రామానికి వెళ్తుండగా శనివారం అర్ధరాత్రి జగ్గయ్యపల్లి గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కింద పడిపోగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కానీ కుటుంబ సభ్యులు ఎవరో వాహనం ఢీ కొట్టినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే రాకేష్ కు నిశ్చితార్ధం అయింది.

Advertisement

Next Story