వరికోత మిషన్ లో పడి యువకుడి మృతి

by Shiva |   ( Updated:2023-05-14 09:27:00.0  )
వరికోత మిషన్ లో పడి యువకుడి మృతి
X

దిశ గొల్లపల్లి : వరికోత మిషన్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అబ్బపూర్ కు చెందిన చెవుల రంజిత్ తమ పొలంలో వరి కోయించే పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతను ప్రమాదవశాత్తు వరికొత మిషన్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రంజిత్ తండ్రి గమనించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రంజిత్ మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. తండ్రి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed