Crime News: భర్త మర్మాంగాన్ని కాల్చిన భార్య.. కారణం తెలిస్తే షాక్

by sudharani |   ( Updated:2022-08-18 09:33:07.0  )
Crime News: భర్త మర్మాంగాన్ని కాల్చిన భార్య.. కారణం తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం. సహనంతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. కానీ ఆ సహనం కూడా నశిస్తే దారుణాలు జరుగుతాయి. తాజాగా ఓ ఇల్లాలు తన భర్త పెట్టే టార్చర్ భరించలేక సహనం కోల్పోయి.. ఏకంగా భర్త మర్మాంగంపై వేడి నీళ్లు పోసేసింది. అంతేకాకుండా తన భర్త పెట్టే టార్చర్ భరించలేకపోతున్న భర్తపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కావేకిపాక్కంకి చెందిన తంగరాజ్, ప్రియకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన కొన్నేళ్లు బాగానే ఉన్న భర్త ఆ తర్వాత నుంచి మృగంలా మారాడు. తరచూ భార్యపై అనుమానంతో హింసిస్తూ ఉండేవాడు. తన భర్తను మార్చుకోవాలని ప్రియ ఎంత ప్రయత్నించినా అతని తీరులో మార్పు లేదు. ఎందుకిలా చేస్తున్నాడని ఆరా తీయగా అసలు విషయం తెలిసి ఆమె షాక్ అయ్యింది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు రుజువైంది. ఆ కారణంతోనే తనని హింసిస్తున్నడని తెలుసుకున్న భార్య కోపం ఆపుకోలేకపోయింది. తన భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది. అందుకే వేడి వేడిగా మరుగుతున్న నీళ్లు తీసుకొచ్చి భర్త మర్మాంగంపై పోసేపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు ఎలా అయినా న్యాయం చేయాలంటూ కేసు పెట్టింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా, భర్త శరీరం 40% కాలిపోవడంతో పోలీసులు ప్రియను అరెస్టు చేశారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed