- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Shiva |

X
దిశ, జగదేవపూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన కొత్తోజి బ్రహ్మచారి (58) అనే వ్యక్తి ఈనెల 1 న జగదేవపూర్ నుంచి స్వగ్రామైన వట్టిపల్లికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రంమంలో వట్టిపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్ ను బలంగా ఢీ కొనడంతో బ్రహ్మచారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story