- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువుగా ఫోజిచ్చాడు.. మతం మార్చాడు: యూపీలో మహిళ ఫిర్యాదు
లక్నో: ‘హిందువుగా ఫోజిచ్చాడు.. నా మతం మార్చాడు. మాంసం తినాలని ఒత్తిడి చేశాడు. తన తండ్రితో బలవంతంగా సెక్స్ చేయాలని వేధించాడు’ అంటూ ఉత్తర ప్రదేశ్ లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన మతమార్పిడి నిషేధ చట్టం కింద ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బరేలీ జిల్లాకు చెందిన 24 ఏళ్ల బాధిత మహిళ జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆబిద్ అనే వ్యక్తి అంకిత్ పేరుతో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దాన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మతం మార్చాడు. బలవంతంగా మాంసం తినిపించాడు.
అంతేకాదు.. తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. తాను ఎదురు తిరగడంతో అతడి కుటుంబ సభ్యులు మహిళను కొట్టి ఇంట్లో నిర్బంధించారు. ఎలాగోలా తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వాస్తవాలు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజముల్ భాటియా తెలిపారు.
మరో కేసులోనూ..
మరో కేసులో 25 ఏళ్ల అలీమ్ తన పేరును ఆనంద్ గా మార్చుకొని ఓ విద్యార్థినితో స్నేహం చేశాడు. ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకొని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేసుకోవాలని వేధించాడు. మతం మారకుంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయినా వినకపోవడంతో చంపేస్తానని బెదిరిస్తున్నట్లు విద్యార్థిని దేవర్నియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు.