- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవమానంతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి..
X
దిశ, నెల్లికుదురు: అవమానానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన కథనం ప్రకారం.. మునిగల వేడు గ్రామానికి చెందిన దేశ బోయిన శ్రీశైలం(42) అదే గ్రామానికి చెందిన నాగబోయిన బాలరాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాలరాజు కుటుంబ సభ్యులు గురువారం శ్రీశైలం ఇంటికి వచ్చి గొడవకు దిగారు. దుర్భాషలాడుతూ చెప్పులతో కొడుతూ నీవు చనిపోలేదంటే మేమే చంపుతాం అంటూ అవమాన పరిచారు. దీంతో శ్రీశైలం తీవ్ర అవమానానికి గురై పొలం వద్దకు వెళ్లి వేప చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ మేరకు మృతుని భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలరాజు తో పాటు ఆయన కుటుంబసభ్యుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story