ఈదురు గాలులకు విరిగిపడ్డ సెల్ టవర్.. భారీగా ఆస్తి నష్టం

by Sumithra |
ఈదురు గాలులకు విరిగిపడ్డ సెల్ టవర్.. భారీగా ఆస్తి నష్టం
X

దిశ, మర్రిగూడ : మండలంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో సెల్ టవర్, పదిఇండ్లు కూలి భారీగా ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకెళితే మండలంలోని కొట్టాల, మేటి చందాపురం గ్రామపంచాయతీలలో మధ్యాహ్నం ఈదురు గాలులు ఒకవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.

కొట్టాల గ్రామపంచాయతీలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ విరిగిపడి నాలుగు ఇండ్ల పై పడటంతో ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు సైతం నేలకూలాయి. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే నేటిచందాపురం గ్రామపంచాయతీలో ఆరు రేకుల ఇండ్లు ఈదురు గాలులకు రేకులు ధ్వంసం కావడంతో ఇండ్ల బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, అంతరాయమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story