- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిపై దాడి ఘటనలో మృతుడి బంధువులపై కేసు నమోదు
by Shiva |
X
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో తమ బంధువు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడాని అద్దాలు ధ్వంసం చేసి, వైద్యుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ ఎస్.హెచ్.వో విజయ్ బాబు తెలిపారు. మంగళవారం జీజీహెచ్ లో బాలరాజు అనే పేషంట్ పదిహేను రోజుల క్రితం బిక్నూరు మండలం కామారెడ్డిలో గుర్తు తెలియని వాహనానికి ఢీకొని చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి డయాబెటిస్ ఉండటంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు అనాలోచితంగా వైద్య సిబ్బందిపై దాడి చేయగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సెక్షన్ ఐపీసీ 353, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజె మెడికల్ సర్వీసెస్ ఆక్ట్ కింద వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story