ట్యునీషియాలో పడవ బోల్తా 37 మంది గల్లంతు

by Javid Pasha |
ట్యునీషియాలో పడవ బోల్తా 37 మంది గల్లంతు
X

లాంపెడుసా (ఇటలీ) : ఇటలీ తీరంలోని మధ్యధరా సముద్రంలో పడవ బోల్తాపడి 37 మంది వలసదారులు గల్లంతయ్యారు. ట్యునీషియాలోని ఓడరేవు నగరం స్ఫాక్స్ నుంచి 46 మంది సబ్ సహారన్ ప్రాంతవాసులతో ఇటలీకి బయలుదేరిన పడవ.. లాంపెడుసా ద్వీపం దగ్గరికి రాగానే బోల్తా పడింది. బలమైన ఈదురుగాలుల వల్లే సముద్రంలో పడవను బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాలేదని తెలుస్తోంది. 37 మంది ప్రయాణికుల ఆచూకీ దొరకలేదు. గల్లంతైన వారిలో ఏడుగురు మహిళలు, ఒక పసికందు ఉన్నారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.

పడవలోని మిగితా వారిని .. అటువైపుగా వెళ్తున్న మరో నౌక వారు ఆగి రక్షించారని పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన వారంతా లాంపెడుసా తీరానికి సురక్షితంగా చేరుకున్నారని వెల్లడించారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న సబ్-సహారా ఆఫ్రికావాసులపై ట్యునీషియా సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో అక్కడి నుంచి సబ్-సహారా ఆఫ్రికా వలసదారులు ఉపాధిని వెతుక్కుంటూ మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీకి వస్తున్నారు.


Next Story

Most Viewed