‘బీజేపీ మెడలు వంచిన రైతుల పోరాటం.. జయహో రైతు’

by Shyam |
‘బీజేపీ మెడలు వంచిన రైతుల పోరాటం.. జయహో రైతు’
X

దిశ,పరకాల: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం రైతుల పోరాటానికి దిగి వచ్చినట్లు లేనని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు దొగ్గెల తిరుపతి అన్నారు. పరకాల పట్టణంలోని సీపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని ఇది రైతులు చేసిన పోరాట విజయమని హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చారు. గత సంవత్సరం నుంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో, దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేసినా, రైతులు వెనకాడలేదని, పోరాటంలో రైతులు చనిపోయినా చట్టాలను ప్రభుత్వం తొలగించాల్సిందేనని చేసిన రైతు పోరాటానికి జై, జయహో రైతు అని తెలిపారు. రైతు చట్టాలను రద్దు చేస్తూనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కొడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్, ఎస్ఎఫ్ఐ పరకాల టౌన్ అధ్యక్షులు మడికొండ ప్రశాంత్, మండల అధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మడికొండ వరుణ్, నాయకులు శివ, నరేష్, రాజు‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed