కేసీఆర్, జగన్ వ్యక్తిగతంగా ఓకే.. కానీ, మళ్లీ ఈ లొల్లేందీ ?

by Anukaran |
కేసీఆర్, జగన్ వ్యక్తిగతంగా ఓకే.. కానీ, మళ్లీ ఈ లొల్లేందీ ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. నీటి విషయమై ఆయనను ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి వినియోగంపై కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. సాగునీటి విషయంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. నీటిని సక్రమంగా వినియోగించుకుంటే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ వ్యక్తిగతంగా బాగానే ఉన్నారు కానీ, వీరిద్దరూ ప్రజా సమస్యలపట్ల వివాదాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

Advertisement

Next Story