- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాధ్యతలు చేపట్టడం అనైతికం : రామకృష్ణ
by srinivas |

X
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మూలంగా అల్లకల్లోలం అవుతుంటే, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కొత్త కమిషనర్ చెప్పడం సరికాదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాష్ర్టాలు కరోనా నివారణ చర్యలు తీసుకుంటుంటే జస్టిస్ కనకరాజు మాత్రం హడావుడిగా ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టడం అనైతికం అని విమర్శించారు. ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరిపే ఆలోచనలో జగన్ ఉన్నారని స్పష్టం అవుతుందన్నారు. సీఎం జగన్ ఆలోచనా విధానం, బాధ్యతారాహిత్యానికి ఇది అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు.
Tags : cpi,ramakrishna,comments,jagan,Justice Kanakaraju,Election Commissioner
Next Story