‘దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించండి’

by srinivas |
‘దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించండి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా దాడులు జరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల దాడుల విషయంపై సీఎం వైఎస్ జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. రామతీర్థం, రాజమండ్రి, అంతర్వేథి, పాడేరు తదితర ప్రాంతాల్లో..దాదాపు 125 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని లేఖలో ఆయన గుర్తుచేశారు. దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. దేవాలయాల విషయంలో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి సీపీఐ రామకృష్ణ రాసిన లేఖలో వెల్లడించారు.

Advertisement

Next Story