తీయనైన తెలుగు భాషకు తెగులు పట్టించొద్దు

by srinivas |
తీయనైన తెలుగు భాషకు తెగులు పట్టించొద్దు
X

దిశ, ఏపీ బ్యూరో: తీయనైన తెలుగు భాషకు తెగులు పట్టించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. తెలుగు అకాడమి పేరును తెలుగు, సంస్కృత అకాడమిగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాష స్థాయిని తగ్గించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలుగు అకాడమి పేరును మార్చడం సరికాదన్నారు.

సంస్కృత భాషపై అంత ప్రేమ ఉంటే.. దానికి మరో అకాడమి ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని రామకృష్ణ ధ్వజమెత్తారు. తెలుగును ఏపీ ప్రభుత్వం విస్మరిస్తోందని విరుచుకుపడ్డారు. పిల్లల చదువులోకి బలవంతంగా ఆంగ్ల భాషను చొప్పించే ప్రయత్నం చేసిందన్నారు.

తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తాము ఖండిస్తున్నామని హెచ్చరించారు. తెలుగు అకాడమిని యథాతథంగా కొనసాగించాలని, మాతృ భాష అభివృద్ధి కోసం తగినన్ని నిధులను కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story