- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్

దిశ, క్రైమ్ బ్యూరో : ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నాంపల్లిలోని రెడ్ హిల్స్ ఎమ్సీహెచ్ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ పోలింగ్ బూత్ వద్ద ఆయన సతీమణి అనుపమ వీ సజ్జనార్‌తో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ పట్ట భద్రులందరూ ఖచ్చితంగా తమ అమూల్యమైన ఓటు వేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రాడ్యుయేట్స్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓట్ ఫస్ట్.. వర్క్ నెక్స్ట్ అనే నినాదంతో ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్లు ముందుకు రావాలన్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎంఎల్సీ ఎన్నికల నేపథ్యంలో భద్రతాపరంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ పర్యవేక్షణ
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భువనగిరి డీసీపీ నారాయణరెడ్డితో పాటు ఆలేరు, మోటకొండూరు ప్రాంతాలను పరిశీలించారు.