రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

by Shyam |
రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జాతీయ రహదారిపై ఉన్న చెక్ పోస్టులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ తనిఖీ చేశారు. ఇక్రిశాట్, బీహెచ్ఇఎల్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించారు. లాక్‌డౌ‌న్‌కు అందరూ సహకరించాలని, అదే పనిగా రోడ్ల పైకి రాకూడదన్నారు. అలా వచ్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వేసిన లాక్ డౌన్ పెయింటింగ్‌ సజ్జనార్‌ను ఆకట్టుకుంది. ఆర్టిస్ట్ అబ్దుల్ బాసిత్‌ను అభినందించారు.

Tags: CP Sajjanar, lockdown, check post, inspection, ts news


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story