మేడారం జాతరలో వ్యాక్సిన్‌ కంపల్సరీ కాదు

by Shyam |
మేడారం జాతరలో వ్యాక్సిన్‌ కంపల్సరీ కాదు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శనం ఉంటుంద‌ని సోష‌ల్‌ మీడియాలో జ‌రుగుతున్న ప్రచారంలో నిజం లేద‌ని ములుగు డీఎం అండ్ హెచ్‌వో ఆలెం అప్పయ్య తెలిపారు. కరోనా నేపథ్యంలో మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులను వ్యాక్సిన్ వేసుకుంటేనే అధికారులు అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని, ప్రభుత్వమే కొత్త నిబంధ‌న‌ను అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతోంది. ఇదే విష‌యంపై దిశ ప్రతినిధి, ములుగు.. డీఎంఅండ్ హెచ్‌వో అప్పయ్యను వివ‌ర‌ణ కోర‌గా… అలాంటి నిబంధ‌న ఏదీ ప్రభుత్వం విధించ‌లేద‌ని, త‌ప్పుడు ప్రచార‌మేన‌ని కొట్టి పారేశారు. మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులు ల‌క్షల్లో ఉండే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ వేసుకోవ‌డంపై అవ‌గాహ‌న క‌లిగిస్తున్నామ‌ని చెప్పారు. మేడారం జాత‌ర‌కు వివిధ రాష్ట్రాల నుంచి ల‌క్షలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో త‌ద‌నుగుణంగా రాష్ట్ర వైద్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని స్పష్టం చేశారు.

Advertisement

Next Story