వాక్సినేషన్ షురూ.. వీళ్లకు మాత్రమే

by Anukaran |   ( Updated:2021-05-02 22:31:01.0  )
వాక్సినేషన్ షురూ.. వీళ్లకు మాత్రమే
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారమని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తుంది. కరోనా కట్టడి భాగంలోనే వాక్సినేషన్ ప్రక్రియ నిరాటకంగా కొనసాగుతుంది. అయితే గత రెండు రోజుల నుండి ఈ ప్రక్రియ టీకాల కొరత కారణంగా ఆగిన విషయం తెలిసిందే. ఇక మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాన్ని కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. అన్ని ప్రభుత్వాసుపత్రులలోను కరోనా టీకా వేయడానికి స్లాట్ బుకింగ్ ఓపెన్ చేసినట్లు ప్రభుత్వ కొవిడ్‌ టీకా కేంద్రం (GCVC) ప్రకటించింది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఏరియా జీసీవీసీల్లో 200 స్లాట్లు, ఇతర ప్రాంతాల్లో 100 స్లాట్లు లభిస్తాయని తెలిపింది. వాక్సిన్ తీసుకోవాలనుకునేవారు వెంటనే స్లాట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. అంతేకాకుండా స్లాట్ బుకింగ్ లేకుండా నేరుగా ఆసుపత్రికి వచ్చేవారికి టీకా వేయడం కుదరదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed