- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో క్షీణించిన గృహ విక్రయాలు
దిశ, వెబ్‌డెస్క్: 2020 క్యాలెండర్ ఏడాదిలో గృహ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 37 శాతం క్షీణించాయి. హైదరబాద్‌లోనూ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో గృహ విక్రయాలు తగ్గాయని ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆఫీస్ లీజింగ్ డిమాండ్ కూడా 35 శాతం పడిపోయింది. అయితే, గత త్రైమాసికంలో డిమాండ్ గణనీయంగా మెరుగు పడిందని, ఇది కరోనాకు ముందునాటి స్థాయికి చేరువలో ఉందని నైట్ ఫ్రాంక్ బుధవారం తెలిపింది. బుధవారం విడుదల చేసిన 2020 ఏడాది రెండో సగానికి సంబంధించి ‘ఇండియా రియల్ ఎస్టేట్-రెసిడెన్షియల్ అండ్ ఆఫీ అప్‌డేట్’లో దేశంలో ప్రధాన నగరాల్లో నివాస ఆస్తుల అమ్మకాలు 37 శతం తగ్గి 1,54,534 యూనిట్లకు చేరుకున్నాయని పేర్కొంది.
గతేడాదిలో మొత్తం 2,45,861 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. వార్షిక గణాంకాల ప్రకారం.. 2020లో హైదరాబాద్‌లో నివాస గృహాల అమ్మకాలు 38 శాతం క్షీణించి 16,267 యూనిట్ల నుంచి 10,042 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక ఆఫీస్ లీజింగ్ స్థలాలు హైదరాబాద్‌లో 60 లక్షల చదరపు అడుగులకు తగ్గాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ‘కరోనా మహమ్మారి పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, 2020 రెండో భాగంలో అమ్మకాల వృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. మూడో త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పునరుజ్జీవ సంకేతాలను నమోదు చేసింది. చివరి త్రైమాసికంలో గృహాల విక్రయాల్లో గణనీయమైన మెరుగుదలను చూడగలిగామని’ నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ షిషిర్ బైజల్ వెల్లడించారు.