- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ ఫలితాలకు వేళాయే..
by Shamantha N |

X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగగా మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి.ఉదయం 8గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.ఇప్పటికే 11జిల్లాల్లో 21కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు అనంతరం 70 నియోజక వర్గాల్లో పోటి చేసిన 672 మంది సభ్యుల భవితవ్యం తేలనుంది.కాగా,ఢిల్లీకి కాబోయే బాద్ షా ఎవరనే దానిపైనే సర్వత్రా చర్చనడుస్తోంది.ఎగ్జిట్‌పోల్స్ అన్ని చీపురు పార్టీకి ఓటేయగా మళ్లీ కేజ్రీవాలే ఢిల్లీకి రాజు అవుతారని దేశవ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది.అయితే ఈసారి ఎవరి ఊహకందని విధంగా ఫలితాలు రాబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం వెనక ఆంతర్యమేమిటని పలువురు చర్చించుకుంటున్నారు. కేజ్రీ తన చీపురుతో ఫలితాలను ఊడ్చేస్తారా లేదా కమలం వికసిస్తుందా అనేది తెలియాలంటే కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఎదురుచూడాల్సిందే..
Next Story