కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్

by Sridhar Babu |   ( Updated:2021-11-03 03:36:01.0  )
Uma--Medchal-1
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపాలిటీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాన్ ను బుధవారం కౌన్సిలర్ ఉమా నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ ను శాలువాతో సత్కరించి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. వార్డు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు శేఖర్ గౌడ్, శంకర్ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story