- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘కరోనా’’ ప్రపంచ రికార్డు..
ఇప్పటివరకూ మనుషులపైనే పంజా విసిరిన కరోనా వైరస్. ఇప్పుడు జంతువులను కూడా టార్గెట్ చేస్తోంది. హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనావైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డులోకి ఎక్కింది. ఈ కుక్కను 60ఏళ్ల మహిళ పెంచుకుంటోంది. ఆమె నుంచే కుక్కకు కరోనా సోకింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్‌కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనావైరస్ ఉందని రిపోర్ట్ వస్తోంది. గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. వైరస్ బారినపడిన జంతువులను 14రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ మరో రెండు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్న కుక్కలను ఐసొలేషన్‌లో ఉంచారు. ఈ రెండు కుక్కలలో ఒక దానికి కరోనా నెగెటివ్ అని తేలింది. దానికి మరోసారి పరీక్ష నిర్వహించి, మళ్లీ నెగెటివ్ అని తేలితే ఐసొలేషన్ నుంచి విడుదల చేయనున్నారు. మరోకుక్క గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
tags : coronavirus, World record, hong kong, dog, 60 year old woman