'హెచ్ఐవీ లాగే కరోనా కూడా ఎప్పటికీ తగ్గదేమో!'

by vinod kumar |
హెచ్ఐవీ లాగే కరోనా కూడా ఎప్పటికీ తగ్గదేమో!
X

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ హెచ్ఐవీ లాగే శాశ్వతంగా మనతోనే ఉండుపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వ్యవహారాల డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా గురించి పలు వివరాలు వెల్లడించారు. పలు దేశాల్లో లాక్‌డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌తో కలసి జీవించడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ ఇక స్థానిక వైరస్‌గా మారుతుందని.. దాన్ని శాశ్వతంగా కనుమరుగు చేయలేమని అన్నారు. ఎయిడ్స్ వ్యాధికి మనం నిర్మూలించలేకపోయినా.. ఎలా కట్టడి చేయాలో తెలుసుకున్నాం. అదే విధంగా కరోనాను కూడా భావించాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్న కరోనా.. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత తిరిగి పుంజుకోగలదని ఆయన హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ మాట్లాడుతూ.. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనగలిగితే అది అతిపెద్ద ముందడుగు అవుతుంని.. ఆ వ్యాక్సిన్‌‌ను ప్రపంచంలోని అందరికీ చేరవేయగలగడం తమ ముందున్న పెద్ద కర్తవ్యమని ఆయన అన్నారు. కరోనా నుంచి మనం సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని.. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Next Story