పశువులకూ కరోనా వ్యాక్సిన్

by Shyam |
Corona vaccine for cattle
X

దిశ తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ జూపార్క్ లోని సింహాలకు సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జంతువులకు కొవిడ్ సోకితే జరిగే దుష్పరిణామాలను అంచనావేసి ముందుస్తుగా తగిన ఏర్పాట్లను చేపట్టారు. పెంపుడు జంతువులకు, పశువులకు పశుసంవర్థకశాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. మనుషుల నుంచి వైరస్ పశువులకు ఇతర జీవులకు సోకకుండా యుద్ధప్రతిపాధిన చర్యలు చేపట్టారు. వైరస్, బాక్టీరియా, ఇతర వ్యాధులు సోకకుండా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

గ్రామాల వారిగా పశు వైద్యులు పర్యటనలు చేపట్టి జంతువుల్లో వస్తున్న మార్పులను రోగాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ కారణంగా ముందస్తుగా అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో రైతులకు వ్యవసాయంలో ఎంతో ఉపయోగపడే గోజాతి పశువులకు, పెంపుడు జంతువులకు, గొర్రెలు, మేకలు, కోళ్లు, ఇతర జీవులకు కరోనా వ్యాధి సోకితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకుండా రైతులకు అవగాహనలు కల్పిస్తూ తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ జీవాలకు అందుతున్న వైద్యసేవలు, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జీవాల ఆరోగ్య పరిస్ధితులను, వ్యాక్సిన్ పంపిణీని ఇతర చికిత్సలకు సంబంధిచిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

Advertisement

Next Story