దేశవ్యాప్తంగా తొలివిడత కరోనా వ్యాక్సినేషన్..

by Anukaran |
దేశవ్యాప్తంగా తొలివిడత కరోనా వ్యాక్సినేషన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి తొలివిడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. మొదట భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 3వేలకు పైగా ఉన్న కేంద్రాల ద్వారా ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలుత కరోనా వారియర్లకు ప్రాధాన్యం ఉంటుందని కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని టీకా తీసుకున్న వారితో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, తెలంగాణలో తొలి రోజు 140 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా మొత్తం 4,170 మంది టీకా వేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed