కేటీఆర్ సన్నిహితుడికి కరోనా

by Anukaran |   ( Updated:2020-07-28 22:53:06.0  )
కేటీఆర్ సన్నిహితుడికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవలే కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

అయితే, తనతో కాంటాక్టు ఉన్నవాళ్లందరికీ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సదరు ఎమ్మెల్యే సూచించినట్లు కూడా తెలిసింది. కాగా, ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అదేవిధంగా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకి రికవరీ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story