- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్‌కు కరోనా
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.
అయితే ఆయన సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్‌తో కలిసి కలెక్టర్ గౌతమ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో వీరందరిలో ప్రస్తుతం కరోనా ఆందోళన నెలకొంది.
మంగళవారం రాత్రి కలెక్టర్‌కు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అంటే కరోనాతో ఉండగానే కలెక్టర్ అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాల్గొన్నారు. ఇప్పుడు వీరంతా క్వారంటైన్ లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.