సిద్ధిపేటలో మైగ్రాంట్స్‌కు కరోనా పరీక్షలు

by Shyam |
సిద్ధిపేటలో మైగ్రాంట్స్‌కు కరోనా పరీక్షలు
X

దిశ, సిద్ధిపేట: పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లిలోని డీఎక్స్ఎన్ కంపెనీలో పని చేసే (వలస) కార్మికుల అందరికీ బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు డీఎక్స్ఎన్ పరిశ్రమ వద్దకు కొవిడ్ టెస్టులు నిర్వహించే బస్సును పంపించి దాదాపు 300 మంది కార్మికులకు కరోనా పరీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో డీఎక్స్ఎన్ పరిశ్రమ నిర్వాహకులు చంద్రకాంత్, మందపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మూర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story