వైరస్ ఇప్పుడే పోదు.. ఆరు నెలల్లో మరిన్ని స్ట్రెయిన్లు

by vinod kumar |
corona virus
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పుడప్పుడే కనుమరుగవ్వదని, మరిన్ని స్ట్రెయిన్‌ల రూపంలో విజృంభిస్తూనే ఉంటుందని ఫార్మా దిగ్గజం మొడెర్నా సీఈవో స్టిఫాని బాన్సెల్ అన్నారు. దక్షిణార్ధ భూగోళంలో త్వరలో శీతాకాలం ప్రవేశించనున్న నేపథ్యంలో కొత్త స్ట్రెయిన్‌ల కోసం బూస్టర్ డోస్ అవసరమని తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా అనేక వేరియంట్లు కొత్తగా ఏర్పడుతూనే ఉంటాయి. దక్షిణార్ధ భూగోళం త్వరలో మరిన్ని స్ట్రెయిన్లు ఏర్పడే ముప్పు ఉన్నది. అందుకే వైరస్ ఇప్పుడప్పుడే కనుమరుగవ్వదని మేం భావస్తున్నాం. వీటిని ఎదుర్కోవాలంటే కొత్త బూస్టర్ షాట్స్ తీసుకోవడం ఉత్తమం’ అని వివరించారు. మొడెర్నా ప్రస్తుత రెండు డోసుల టీకాకు అదనంగా బూస్టర్ (థర్డ్)డోసును సంస్థ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story

Most Viewed