కరోనా పరీక్షలకు ఏపీ మార్గదర్శకాలు

by srinivas |
కరోనా పరీక్షలకు ఏపీ మార్గదర్శకాలు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల తీరుతెన్నులపై వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా అనుమానితులకు పరీక్షలు చేసేందుకు తొలుత ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలని, ఒకవేళ లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే వెంటనే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని ఆదేశించింది. దాంట్లోనూ నెగెటివ్ వస్తే రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని వివరించింది. ఈ మూడు పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే కరోనా నిర్థారణ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. అంతటితో ఆగకుండా, ఒక్కో జిల్లాకు 20 వేల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు పంపినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైరిస్క్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని పేర్కొంది.

Advertisement

Next Story