- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండోసారొస్తే కొవిడ్ సాంక్రమికం కాదు..
ఒకసారి కరోనా వైరస్ సోకి తగ్గిన తర్వాత కొన్ని వారాలకు మళ్లీ ఆ లక్షణాలు కనిపిస్తే, అంటే మరోసారి పాజిటివ్‌గా తేలినా.. కరోనా వైరస్ పెద్దగా సాంక్రమికం కాదని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అంటున్నారు. కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన 285 మంది శాస్త్రవేత్తలు.. కొవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్లను అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. రీపాజిటివ్‌గా పిలిచే ఈ పేషెంట్లలో మళ్లీ లక్షణాలు కనిపించినప్పటికీ వీరి నుంచి వైరస్ ఇతరులకు సోకేటంత బలంగా లేదని తేలింది. ఒకవేళ వైరస్ ఉన్నా అది చనిపోయిన స్థితిలో మాత్రమే ఉందని వెల్లడైంది.
దీన్ని బట్టి చూస్తే కొవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్లు సామాజిక దూరం నిబంధనను కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. రీపాజిటివ్ పేషెంట్లకు పీసీఆర్ టెస్టులు నిర్వహించినప్పటికీ వారిలో చనిపోయిన కొవిడ్ మాత్రమే కనిపించిందని శాస్త్రవేత్తలు అన్నారు. కొన్ని దేశాల్లో కొవిడ్ నుంచి రికవరీ అయినప్పటికీ పేషెంట్ల మీద చూపిస్తున్న వివక్షను తగ్గించడానికి ఈ పరిశోధన లాభపడుతుందని వారు సూచించారు. కాబట్టి ఐసోలేషన్ పీరియడ్ పూర్తయిన కొవిడ్ రికవరీ పేషెంట్లు.. వారి ఆరోగ్యం కుదుటపడినట్టయితే రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని వారు సలహా ఇచ్చారు. వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ శరీరంలో వేగంగా అభివృద్ధి చెందడం వల్లే ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.