- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @ 647
ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వడం లేదు. వైద్య నిపుణుల సూచనలు, సీఎం సమీక్షలు, లాక్‌డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, ఏమాత్రం సత్ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఏపీలో గత 24 గంటల్లో జరిగిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో 44 కొత్త కేసులు నమోదైనట్టు ప్రకటించింది. దీంతో ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 647కు చేరుకుంది. కరోనా బారిన పడిన 565 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 65 మందికి కరోనా నయమై ఇళ్లకు చేరినట్టు ప్రకటించింది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది.
నిన్న ఉదయం 9 నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో అత్యధికంగా కర్నూలు నుంచి 26 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ఆ తరువాతి స్థానంలో 6 కేసులతో కృష్ణా జిల్లా నిలవగా, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు కేసులు బయటపడ్డాయి. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో చెరి మూడు కేసులు నమోదు కాగా, విశాఖపట్టణంలో ఒక్క పాజిటివ్ కేసు వెలుగు చూసింది.
దీంతో ఏపీలో అత్యధిక కరోనా కేసులు కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. 158 కేసులు నమోదు కాగా, ఒక్కరు ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ తరువాతి స్థానంలో 129 కేసులతో గుంటూరు జిల్లా నిలిచింది. 125 మంది చికిత్స పొందుతుండగా, నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ తరువాతి స్థానంలో 75 కేసులతో కృష్ణా నిలవగా, 66 మంది చికిత్స పొందుతున్నారు. నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఐదుగురు మృత్యువాత పడ్డారు.
ఇక నెల్లూరు జిల్లాలో 67 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం 44, కడప 37, పశ్చిమగోదావరి 35, అనంతపురం 29, చిత్తూరు 28, తూర్పుగోదావరి జిల్లాలో 24, వైజాగ్‌లో 21 కేసులు నమోదయ్యాయి.
Tags: corona virus, covid-19, arogyaandhra, twitter, health department